సకాలంలో టీకాలు వేయించాలి
గర్భిణీలను ముందస్తుగా నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి మహబూబాబాద్, సెప్టెంబరు 17 (చైతన్యగళం): పుట్టిన శిశువు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సకాలంలో టీకాలు వేయించాలని సబ్‌యూనిట్ అధికారి వడ్డెబోయిన శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గర్భిణీల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. టీకాలను నిర్దేశిత ఉష్ణోగ్రతలో భద్రపరుస్తూ నాణ్యతకు భంగం కలగకుండా కోల్డ్ చైన్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. టీకా అనంతరం...