మర్రిగూడలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

మర్రిగూడ, సెప్టెంబరు 17 (చైతన్యగళం): మండల కేంద్రంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, ఎస్‌ఐ రాంబాబు, ఎంఈవో శారద, వైద్యాధికారి శంకర్‌నాయక్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్‌సింగ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.