CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వ్యవసాయ అధికారులకు ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు

  • పథకాల అమలు.. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో విశేష కృషి

సోన్‌, సెప్టెంబరు 17 (చైతన్యగళం‌): ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో సోన్‌ మండల వ్యవసాయ అధికారి వినోద్‌, మాదాపూర్‌ క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి రాజ్‌కుమార్‌కు ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు లభించాయి. ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అధ్యక్షతన, జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

వ్యవసాయ శాఖ ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు వానాకాలం సీజన్‌లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇద్దరు అధికారులు చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రైతులకు పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో చొరవ చూపడం, ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించడంలో వారి సేవలను పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ సిబ్బంది వినోద్‌, రాజ్‌కుమార్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.