CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 5:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రాజాపేట తండా ఉపసర్పంచ్‌పై దాడి ఆరోపణలు

మర్రిగూడ, సెప్టెంబరు 17 (చైతన్యగళం): రాజాపేట తండా ఉపసర్పంచ్‌ కొర్ర సునీతపై బుధవారం కొందరు వార్డు సభ్యులు దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. ఉపసర్పంచ్‌ ఎన్నిక సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదంటూ తనను దూషించి దాడి చేశారని సునీత పేర్కొన్నారు.

ఘటనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మేతరి శంకర్‌, వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.