నల్లెల్లలో రాసమల్ల మల్లయ్య మృతి

కురవి, సెప్టెంబరు 15 (చైతన్యగళం): నల్లెల్ల గ్రామం రెండో వార్డు పరిధికి చెందిన రాసమల్ల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ రెంటాల కృష్ణ పాలకవర్గ సభ్యులతో కలిసి మల్లయ్య పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, భారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.