షాద్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా వినాయక ప్రతిష్ట
షాద్ నగర్ ,సెప్టెంబర్ 14 (చైతన్యగళం) : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చీపిరి రవి యాదవ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా...