CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:34 pm Posted by : CHAITHANYA GALAM NEWS

షాద్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా వినాయక ప్రతిష్ట

షాద్ నగర్ ,సెప్టెంబర్ 14 (చైతన్యగళం) : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.
షాద్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చీపిరి రవి యాదవ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, షాద్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, గుండు అశోక్, లింగం, విజయ్, వెంకటేష్ గుప్తా, శ్రీకాంత్, రాజశేఖర్, సంజు నాయక్, సతీష్, శ్రీను, తేజ యాదవ్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.