నందికొట్కూరు, సెప్టెంబరు 14 (చైతన్యగళం): నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను టౌన్ సీఐ అశోక్‌కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యాలు, భక్తుల రాకపోకలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతులు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని సీఐ అశోక్‌కుమార్ కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.