సురక్ష గణపతికి ఎస్పీ డి.జానకి ప్రత్యేక పూజలు
జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష మహబూబ్‌నగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష గణపతికి జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. అనంతరం ఎస్పీ పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే...