CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:38 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సురక్ష గణపతికి ఎస్పీ డి.జానకి ప్రత్యేక పూజలు

  • జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 14 (చైతన్యగళం): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష గణపతికి జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్‌ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.

అనంతరం ఎస్పీ పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు పరస్పర సోదరభావంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో అదనపు ఏఆర్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పయ్య, టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇజాజ్‌ ఉద్దీన్‌, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్‌, అశోక్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.