ఐక్యంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం
భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలుద్దాం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): హిందువులంతా సంఘటితంగా ఉండి గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. హిందువుల ఐక్యతా స్ఫూర్తికి, భక్తికి గణేష్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గణేష్ మండపాల నిర్వహణలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామం...