దేవరకొండ ప్రజలకు కేతావత్ లాలూనాయక్ వినాయక చవితి శుభాకాంక్షలు
దేవరకొండ, సెప్టెంబరు 14 (చైతన్యగళం): వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర నాయకులు కేతావత్ లాలూనాయక్ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి కేవలం పండుగ మాత్రమే కాదని, చెడు ఆలోచనలను విడనాడి మంచి మార్గంలో నడవాలని చాటిచెప్పే ఆధ్యాత్మిక సందేశమని పేర్కొన్నారు. గణనాథుడి రూపం మనకు ఎన్నో విలువైన జీవిత పాఠాలను అందిస్తుందని తెలిపారు. పెద్ద చెవులు ఇతరుల మాటలను ఓపికగా వినాలని, చిన్న కళ్లు ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచిస్తాయని చెప్పారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని...