బైరెడ్డి నగర్‌లో స్కేరీ హౌస్‌తో గణనాథుడి దర్శనం
కనురెప్పలు తెరిచి మూసే గణనాథుడు.. భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేకత నందికొట్కూరు, సెప్టెంబరు 14 (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కర్నూలు రోడ్డులో గల బైరెడ్డి రాజు నగర్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూకేఆర్ యూత్ ఆధ్వర్యంలో స్కేరీ హౌస్ ఏర్పాటు చేసి, అందులో గణనాథుడిని దర్శించుకునేలా చేసిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గణనాథుడి విగ్రహం కనురెప్పలు తెరిచి మూస్తున్నట్లుగా కనిపించేలా చేసిన ప్రత్యేక ఏర్పాటు భక్తుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేకతను చూసేందుకు పరిసర...