వాహనాలు ప్రజల కోసమా.. లేక అమ్మేస్తారా?

ఫాగింగ్‌, చెత్త సేకరణ వాహనాలు ఎందుకు వినియోగంలోకి రావడం లేదు?: మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కరీంనగర్‌, సెప్టెంబరు 14 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో దోమల బెడద, విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కొత్తగా మంజూరైన ఫాగింగ్‌, చెత్త సేకరణ వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంపై మాజీ మేయర్‌, తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన వాహనాలు ప్రజల సేవలో ఉండాల్సిందిపోయి మూలన ఉండటం ఏమిటని ప్రశ్నించారు....