కరీంనగర్‌లో త్వరలో మరో సమీకృత సామూహిక వంటశాల

17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం కరీంనగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పాఠశాల అల్పాహార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమీకృత సామూహిక వంటశాలను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. పాఠశాల అల్పాహార కార్యక్రమాన్ని...