గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
నేర నియంత్రణపై సీపీ గౌష్ ఆలం సమీక్ష.. నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కరీంనగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఆగస్టు నెల నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు–చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. గణేష్ మండపాల...