పోషకాహారంతో తల్లి–బిడ్డల ఆరోగ్య పరిరక్షణ
గర్భిణీలు, బాలింతలు బలవర్ధక ఆహారం తీసుకోవాలి - జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): గర్భిణీలు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్కండేయనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనతను నివారించేందుకు మునగ, బచ్చలి వంటి ఆకుకూరలు, పల్లీలు, బెల్లం తదితర...