పుట్టిన గడ్డపై మమకారం.. ప్రజాసేవపై సంకల్పం
ఆపదలో ఆపద్బాంధవుడిగా.. కల్వకుర్తి ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా దృక్పథం కల్వకుర్తి, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): పదవిని ఆశించకుండా.. ప్రజల అవసరాన్ని గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తి సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి. రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతూనే ఐక్యత ఫౌండేషన్ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదల కష్టం తన కష్టంగా భావిస్తూ.. అవసరమైన వేళ అండగా నిలవాలన్న ఆలోచనతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పుట్టిన గడ్డపై మమకారంతో.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ...