CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 2:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

  • మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు కన్న కృష్ణ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు కన్న కృష్ణ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కన్న కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు నీటి వనరులు కలుషితం కాకుండా చూడవచ్చని తెలిపారు. పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని ప్రజలకు సూచించారు.