అశోక్‌నగర్‌లో తీరిన తాగునీటి కష్టాలు
54వ డివిజన్‌లో నూతన బోరు ప్రారంభం ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): నగరంలోని 54వ డివిజన్ అశోక్‌నగర్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసుల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన బోరును నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కాలనీలో తీవ్రంగా ఉన్న నీటి ఎద్దడిని గుర్తించిన 54వ డివిజన్ కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ ప్రత్యేక...