అభివృద్ధే లక్ష్యం.. మౌలిక వసతులే ప్రాధాన్యం
42వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం: యాదగిరి సునీల్‌రావు కరీంనగర్, సెప్టెంబర్ 12 (చైతన్యగళం): నగర అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. డివిజన్‌లోని కాశ్మీర్‌గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించిన సునీల్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు....