మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ

విద్యార్థుల చేతుల్లో రూపుదిద్దుకున్న వినాయక విగ్రహాలు పర్యావరణహిత విగ్రహాలనే పూజించాలి: ప్రధానోపాధ్యాయుడు లవన్‌కుమార్‌ రామడుగు, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని కొరటపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లవన్‌కుమార్‌ అన్నారు. పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా లవన్‌కుమార్‌ మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయని తెలిపారు. రసాయనిక రంగులు, ఇతర పదార్థాలతో తయారైన విగ్రహాల వల్ల నీటి...