అర్హులైన ఒక్క ఓటూ తొలగకూడదు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
ఎస్‌ఐఆర్‌లో హియరింగ్స్, అనామలీస్, నో మ్యాపింగ్‌పై బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా ఎన్నికల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని అదనపు కలెక్టర్, మానకొండూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ప్రచార దినం సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెజ్జంకి మండలం తోటపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రం,...