గణేష్‌ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలి

కలెక్టర్‌, సీపీ, ఇరిగేషన్‌ ఎస్‌ఈలకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ వినతి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): గణేష్‌ నిమజ్జనానికి ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా సరిపడా నీటిని విడుదల చేసి, అవసరమైన నీటిమట్టాన్ని కొనసాగించాలని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌లను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు లేఖలు రాసి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...