పలు ప్రాంతాల్లో అగ్నిమాపక అధికారుల ఆకస్మిక తనిఖీలు
పాఠశాలల్లో అగ్నిమాపక పరికరాల పనితీరుపై పరిశీలన.. ఐదు రోజులు గడువు కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): అగ్ని ప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ చర్యల్లో భాగంగా కరీంనగర్ నగరంలోని పద్మనగర్, భగత్‌నగర్ ప్రాంతాల్లో పలు పాఠశాలలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పాఠశాలల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్నచోట పనిచేసే స్థితిలో లేకపోవడం గుర్తించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. అగ్నిమాపక భద్రతా చర్యలను వెంటనే చేపట్టేందుకు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు ఐదు రోజుల గడువు...