- రూ.1.17 కోట్ల పరిహారం చెల్లింపునకు బీమా సంస్థల అంగీకారం
మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 25 మోటారు వాహన నష్ట పరిహార కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ లోక్ అదాలత్ బెంచ్‌కు అధ్యక్షత వహించి కేసులను పరిష్కరించారు.
ప్రమాదాల్లో నష్టపోయిన బాధితులకు మొత్తం రూ.1.17 కోట్ల నష్ట పరిహారం అందించేందుకు బీమా కంపెనీల అధికారులు అంగీకరించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారం కావడంతో బాధితులకు త్వరితగతిన న్యాయం లభించిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. న్యాయవాది వై. చెన్నమల్లారెడ్డి లోక్ అదాలత్ సభ్యుడిగా వ్యవహరించారు.