మట్టి వినాయకుడితోనే పర్యావరణ పరిరక్షణ

మట్టి విగ్రహాలనే పూజించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళీమోహన్ అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ కోర్టు సిబ్బంది, ప్రజలకు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...