CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజా పాలనకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిదర్శనం!

  • బీసీల సమస్యలపై పీసీసీ చీఫ్‌కు వర్ధన్నపేట కాంగ్రెస్‌ నేతల వినతి
  • బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ను ఘనంగా సత్కరించిన బొక్కల ప్రమోద్‌, కుల్ల యాకాంతం

వర్ధన్నపేట,సెప్టెంబర్ 12(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ను వర్ధన్నపేట అసెంబ్లీ యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బొక్కల ప్రమోద్‌, వర్ధన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ ఉపాధ్యక్షులు కుల్ల యాకాంతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం వెంకట్రావుపల్లి గ్రామ సమస్యలతో పాటు బీసీలకు సంబంధించిన పలు సమస్యలను పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కుల్ల యాకాంతం మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి వార్డు స్థాయి ప్రజాప్రతినిధి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను ప్రజల గడప వద్దకే తీసుకువస్తున్నారని అన్నారు.“గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి ఉండేది. కానీ నేడు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ సామాన్య కార్యకర్తలు, ప్రజలకు సైతం అందుబాటులో ఉంటున్నారు. ఇదే ప్రజా పాలనకు నిదర్శనం” అని యాకాంతం వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలను నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే కాంగ్రెస్‌ నాయకుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీసీల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.