విద్యా కేంద్రీకరణ విధానాలను విడనాడాలి
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు మైస శ్రీనివాసులు మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): తెలంగాణలో విద్యారంగ సంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు మైస శ్రీనివాసులు అన్నారు. విద్యను కేంద్రీకృతం చేసే విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విద్యారంగ సంక్షోభం–సవాళ్లు, కర్తవ్యాలు’ అనే అంశంపై శుక్రవారం టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా...