భూమిపూజకు ఆర్యవైశ్యులు తరలిరావాలి

రాష్ట్ర సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్‌గుప్త పిలుపు యాచారం, సెప్టెంబర్‌ 12 (చైతన్యగళం‌): ఉప్పల్‌ భగాయత్‌లో ఈ నెల 13న నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభ భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆర్యవైశ్య సోదరసోదరీమణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్‌గుప్త కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణగుప్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. భూమిపూజ అనంతరం శ్రీనివాస కల్యాణం, ఉదయం 10.30 గంటలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు...