అరవింద విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు అర్ధ శతాబ్ద కాలంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న అరవింద విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. 1995–96 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు బస్టాండ్ రోడ్డులోని కిరాణా వర్తక సంఘం భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అరవింద విద్యాసంస్థల అధినేత ఎన్. చంద్రదేవ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరవింద విద్యాలయంలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత...