హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

రూ.1,000 జరిమానా.. 2026లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22వ నేర నిర్ధారణ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): కరీంనగర్‌-1 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పైడిపాల వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు గౌరవ ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.1,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసు వివరాల ప్రకారం.. 2023 జూన్‌ 29న కరీంనగర్‌లోని క్రిస్టల్‌ ప్లాజా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 203లో గుండా సరిత హత్యకు గురయ్యారు. మృతురాలితో నిందితుడికి సన్నిహిత సంబంధం...