- సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం ప్రిన్సిపాల్ ఏ.అపర్ణ
తిప్పర్తి,సెప్టెంబర్ 12 (చైతన్యగళం): తిప్పర్తి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల నందు విద్యాబోధన చేస్తున్న కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలు ఎం. మమత ,బాటని ఉపాధ్యాయురాలు కర్నాటి సంధ్య మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ ఏ అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందిన ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరుగుతుందని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు సేవలు అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.