పలు ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు
కల్తీ స్వీట్లు ధ్వంసం.. భారీగా ముడి పదార్థాల స్వాధీనం కరీంనగర్ (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఆహార వ్యాపార సంస్థల్లో ఆహార భద్రత అధికారి రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టారు. కరీంనగర్‌లోని బౌపేటలో బాలాజీ మ్యాజిక్ మిఠాయి తయారీ కేంద్రంలో తీవ్ర పరిశుభ్రత లోపాలు గుర్తించారు. పాలతో తయారు చేయాల్సిన అజ్మేరి కలాకండ్, మిల్క్ మైసూర్‌పాక్‌లను పాలు ఉపయోగించకుండా తయారు...