రైస్ మిల్లర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ఖరీఫ్–రబీ ధాన్యం మిల్లింగ్, సీఎంఆర్ సరఫరాలో ఇబ్బందులు.. అధికారులతో సమావేశం నిర్వహించాలని వినతి కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): జిల్లాలో ఖరీఫ్, రబీ ధాన్యం సేకరణ, మిల్లింగ్, సీఎంఆర్ సరఫరా, ప్రభుత్వ సంస్థలకు బియ్యం పంపిణీలో రైస్ మిల్లర్లు నిరంతరం సహకరిస్తున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించింది. 2025–26 సంవత్సరానికి మిల్లింగ్ ధాన్యంలో అధిక భాగం ఉప్పుడు బియ్యానికి అనుకూలంగా ఉందని, ముడి బియ్యం...