గిరిజన సంస్కృతికి తీజ్ పండుగ ప్రతీక

తీజ్ వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని 11వ డివిజన్‌లో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గిరిజన కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని మేయర్ అన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ కుటుంబాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఐక్యత వెల్లివిరియాలని ఆకాంక్షించే పవిత్ర పర్వదినమన్నారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సంస్కృతి,...