విద్యార్థుల భద్రతే లక్ష్యంగా షీ టీం
గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై అవగాహన ఆమనగల్లు, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): విద్యార్థులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని షీ టీం కానిస్టేబుల్ జ్యోతి సూచించారు. శుక్రవారం పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ఇర్విన్ పాఠశాలలో షీ టీం ఇన్‌చార్జి జగదీశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాలల భద్రత, మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. చిన్నారులు ఎదుర్కొనే వేధింపులు, అసభ్య ప్రవర్తన, అనుచిత స్పర్శ వంటి అంశాలపై ప్రతి...