సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్.. విమోచన స్మృతి కేంద్రాలు, భారీ మ్యూజియం ఏర్పాటు చేయాలి కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ లభించిందని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్...