తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై ఏడాది నిషేధం

తయారీ నుంచి విక్రయం వరకు అన్ని దశలపై ఆంక్షలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నాన్‌-డెయిరీ, కృత్రిమ, అనలాగ్‌ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్‌ 10, 2026 నుంచి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాన్‌-డెయిరీ, కృత్రిమ లేదా అనలాగ్‌ పనీర్‌ను ఏ రూపంలోనైనా తయారు చేయడం, ప్రాసెసింగ్‌ చేయడం, ప్యాకింగ్‌, నిల్వ, పంపిణీ, విక్రయించడంపై నిషేధం వర్తించనుంది. అంటే ఉత్పత్తి...