CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:50 am Posted by : CHAITHANYA GALAM NEWS

కార్మికుల కోసం అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

రామగుండం (చైతన్యగళం): రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై గళం విప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కార్మికుల సమస్యలను పట్టించుకోకపోగా, కార్మిక సంఘాలను అణచివేసే విధంగా వ్యవహరించిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన స్వాగతించారు. కార్మికుల ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్మికులకు అండగా నిలిచే విధానాలను ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోరారు.