ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు
కడ్తాల్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): మారుమూల తండాకు చెందిన వ్యవసాయ కుటుంబ విద్యార్థి విస్లావత్ శివ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటాడు. యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన శివ, కడ్తల్ మండలం పచెల్కతాండాకు చెందిన విస్లావత్ భాస్కర్, కమిలి దంపతుల కుమారుడు. ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాడు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 700 మార్కులకు 501 మార్కులు సాధించి, ఎస్టీ కేటగిరీలో...