ఆల్ఫోర్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి: నరేందర్‌రెడ్డి సుల్తానాబాద్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సుల్తానాబాద్‌లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ,...