శాంతిభద్రతల పరిరక్షణతోనే గణేష్ ఉత్సవాలు

మార్గదర్శకాల పోస్టర్‌ విడుదల చేసిన సీపీ గౌష్‌ ఆలం కరీంనగర్(చైతన్యగళం): గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం సూచించారు. కమిషనరేట్‌ పరిధిలోని అస్త్ర కన్వెన్షన్‌ హాల్‌లో గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన భద్రతా మార్గదర్శకాల పోస్టర్‌ను పోలీసు అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. కొత్త మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, వివాదాస్పద ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయరాదని సీపీ స్పష్టం చేశారు....