ఆయుధాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని ఆయుధాగారంతో పాటు కమిషనరేట్ కేంద్రంలోని 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌కు చెందిన ఆయుధాగారాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుధ భద్రతా గదిలోని భద్రతా ప్రమాణాలు, ఆయుధాల నిల్వ విధానం, రక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయుధాగారంలో ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రి వివరాలను అధికారిక రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. సిబ్బందికి ఆయుధాల కేటాయింపు, తిరిగి జమ చేసే వివరాలతో కూడిన లాగ్‌బుక్‌లు, నిల్వ రిజిస్టర్లను పరిశీలించి రికార్డుల...