ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం వెంటనే విడుదల చేయాలి
మూడేళ్లుగా పెండింగ్‌లో 102 కేసులు.. 180 మంది బాధితులకు చెల్లింపులు చేయాలి కులాంతర వివాహితుల ప్రోత్సాహక నగదు బకాయిలను తక్షణమే చెల్లించాలి: కేవీపీఎస్ నల్లగొండ, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): జిల్లాలో గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన 102 కేసుల్లోని 180 మంది బాధితులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న...