చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

కరీంనగర్ (చైతన్యగళం): బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కొడిమ్యాల, చింతకుంట, కరీంనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక పోరులో ఐలమ్మ చూపిన సాహసం, పోరాట పటిమ అనన్యసామాన్యమని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె...