బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు వేళాయె
పండుగ సందడి మొదలు.. మండపాల ఏర్పాట్లలో జాగ్రత్తలు తప్పనిసరి భక్తి ఉత్సాహంతో పాటు భద్రతకు ప్రాధాన్యం.. చిన్న నిర్లక్ష్యమే పెను ప్రమాదం వినాయక చవితి పర్వదినం సమీపించింది. పట్టణాలు, పల్లెల్లో పండుగ సందడి మొదలైంది. వీధివీధినా బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ మండపాల నిర్మాణం.. విద్యుత్ దీపాల అలంకరణ.. రంగురంగుల తోరణాలు.. స్వాగత ద్వారాలు.. ఆకట్టుకునే అలంకరణలతో ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. యువత ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఈ ఉత్సాహానికి అప్రమత్తత తోడైతేనే పండుగ సంతోషంగా సాగుతుంది. లేకుంటే చిన్నపాటి...