మేడిపల్లిలో రైతు, విద్యుత్ సమస్యలపై బీజేపీ మహాధర్నా

రోడ్డుపై నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పోలీసులతో బీజేపీ నాయకుల తోపులాట జగిత్యాల (చైతన్యగళం): రైతు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మేడిపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, విద్యుత్‌ కోతలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతే, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాతో జగిత్యాల...