శ్రీ నవనంది హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

ఎంఈఓ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ ధర్నా.. వినతిపత్రం అందజేత నందికొట్కూరు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్‌పై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని సమస్యలను వివరిస్తూ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి బోయ సాయి, డివిజన్ అధ్యక్షులు ఆసిఫ్ అహ్మద్ మాట్లాడుతూ శ్రీ నవనంది హైస్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే...