CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న యాదగిరి సునీల్‌రావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): నగరంలోని భగత్‌నగర్‌ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆదర్శ్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్‌ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

శ్రీకృష్ణుడి చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టి ఉట్టి కొట్టే పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న యువకులపై రంగునీళ్లు చల్లుతూ ఉత్సాహపరిచారు. విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదర్శ్‌ యూత్‌ క్లబ్‌ సభ్యులు, నాయకులు, భగత్‌నగర్‌ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.